శ్రీలంక, మారిషస్‌‌‌‌‌‌‌‌లో యూపీఐ

శ్రీలంక, మారిషస్‌‌‌‌‌‌‌‌లో యూపీఐ

 న్యూఢిల్లీ :  మనదేశంలో ఎంతో పాపులర్​ అయిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ) సేవలు సోమవారం శ్రీలంక,  మారిషస్‌‌‌‌‌‌‌‌లలో ప్రారంభమయ్యాయి. వర్చువల్​గా జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ,  మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్,  శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే యూపీఐ,  రూపే కార్డ్ సేవలను లాంచ్​ చేశారు.  ఈ కొత్త ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ సేవలు రెండు దేశాలకు సహాయపడతాయని మోదీ అన్నారు.   

యూపీఐ వ్యవస్థ వల్ల శ్రీలంక, మారిషస్‌‌‌‌‌‌‌‌లు లాభపడతాయని చెప్పారు. ఢిల్లీకి రెండు దేశాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక,  మారిషస్‌‌‌‌‌‌‌‌లలో యూపీఐ సేవలను ప్రారంభించారు. దీనివల్ల శ్రీలంక  మారిషస్‌‌‌‌‌‌‌‌లకు ప్రయాణించే భారతీయ పౌరులకు, భారతదేశానికి ప్రయాణించే మారిషస్ జాతీయులకు యూపీఐ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ పేమెంట్​ విధానాన్ని డెవెలప్​ చేసింది. ఇది మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌ల ద్వారా ఇంటర్​-బ్యాంక్ లావాదేవీలను సులభతరం చేయడానికి వాడే రియల్ టైమ్ పేమెంట్​ సిస్టమ్​.