గిగ్‌‌‌‌ వర్కర్లు సేద తీరేందుకు అప్‌‌‌‌జీ హౌస్: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్‌‌‌‌ వర్కర్లు సేద తీరేందుకు అప్‌‌‌‌జీ హౌస్: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించిన మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి 
  •     ఏసీ, క్లీన్ రూమ్స్‌‌‌‌, మొబైల్ చార్జింగ్‌‌‌‌ 
  •     శుభ్రమైన టాయిలెట్లు, భోజన సౌకర్యం 
  •     ఉచిత డాక్టర్​ కన్సల్టేషన్​ సదుపాయం
  •     గిగ్‌‌‌‌ వర్కర్లకు చట్టబద్ధమైన భరోసా
  •     కనీస వేతనం, సామాజిక భద్రత కల్పిస్తామని వెల్లడి

గచ్చిబౌలి, వెలుగు: గిగ్‌‌‌‌ వర్కర్లు పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి, మొబైల్​ చార్జింగ్‌‌‌‌తోపాటు అవసరమైన సదుపాయాలన్నీ ఒకేచోట పొందేందుకు అప్‌‌‌‌జీ హౌస్‌‌‌‌లు ఒక మంచి వేదికగా ఉపయోగపడుతాయని శక్తి శాఖ మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లో ఇలాంటి కేంద్రాలు మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజలకు నిత్యావసరాలు, ఆహార పదార్థాలు డెలివరీ చేసే గిగ్​వర్కర్లు సేద తీరేందుకు కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన అప్‌‌‌‌జీ హౌస్‌‌‌‌ను మంత్రి వివేక్​ వెంకటస్వామి శుక్రవారం ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర జీవన విధానంలో గిగ్​ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనం, సామాజిక భద్రత, సంక్షేమ సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.  గిగ్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణ ప్లాట్‌‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గిగ్​వర్కర్లు తమ భవిష్యత్తు అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు నైపుణ్య శిక్షణ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.  

చాలా తక్కువ ఫీజుతో సభ్యత్వం

ఈ సెంటర్‌‌‌‌లో డెలివరీ రైడర్లు రూ. 99, నెలకు 349 చెల్లించి సభ్వతం పొందవచ్చని అప్‌‌జీ కో ఫౌండర్ ఆదిత్య వుచి తెలిపారు.​ ఇందులో ఏసీ సిట్టింగ్​, పరిశుభ్రమైన వాష్​రూమ్‌‌లు, నాణ్యమైన బ్రేక్‌‌ఫాస్ట్​, లంచ్, డిన్నర్, మొబైల్​ చార్జింగ్​ సదుపాయాలు ఉంటాయని వివరించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉచిత డాక్టర్​ కన్సల్టేషన్​ సదుపాయం కల్పించినట్టు చెప్పారు. మహిళా రైడర్ల కోసం ప్రత్యేక లాంజ్‌‌​ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్​రెడ్డి, యాదవ సహకార కార్పొరేషన్​ చైర్మన్​రఘునాథ్​యాదవ్,  కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి హరిచందన, అప్‌‌జీ కో ఫౌండర్​ నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.