ఉప్పల్ హరిహర క్షేత్రంలో కోటి లింగాల స్థాపన కరపత్రం ఆవిష్కరణ

ఉప్పల్ హరిహర క్షేత్రంలో కోటి లింగాల స్థాపన కరపత్రం ఆవిష్కరణ

ఉప్పల్, వెలుగు: చిల్కానగర్​లోని​ హరిహర క్షేత్రం చిలుకేశ్వర ఆంజనేయ స్వామి ఆలయంలో జూన్​ నెలలో నిర్వహించనున్న కోటిలింగాల స్థాపన మహోత్సవం కరపత్రాన్ని ఉప్పల్​ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.  

ఆలయ అభివృద్దికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, ఆలయ పునర్నిర్మాణానికి భక్తులందరూ కలిసికట్టుగా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బన్నాల ప్రవీణ్​, ఆలయ కమిటీ ప్రతినిధులు దాసరి కృష్ణ, గోనె శ్రీకాంత్​, రమేష్​ గౌడ్, ​పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.