పీఎస్ లో పనిచేసే మహిళకు పోలీసుల చేయూత

పీఎస్ లో పనిచేసే మహిళకు పోలీసుల చేయూత

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ పోలీస్ స్టేషన్​లో హౌస్‌‌ కీపింగ్ పనులు నిర్వహిస్తున్న సులోచన భర్త రవీందర్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబానికి స్టేషన్ అధికారులు, సిబ్బంది అండగా నిలిచారు. సోమవారం సులోచనకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ఉప్పల్ సీఐ భాస్కర్, డీఐ రామలింగారెడ్డి చేతుల మీదుగా చెక్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్సైలు మాధవరెడ్డి, రజనీకర్, వినయ్, సమత తదితరులు  ఉన్నారు.