
ఉప్పల్, వెలుగు: పోకిరీలకు వత్తాసు పలికిన ఉప్పల్ ఎస్సై శంకర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సీఐ ఎలక్షన్ రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసి రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. ఉప్పల్ భగాయత్‌లో ఈ నెల14న రాత్రి ఇద్దరు ప్రేమికులను పోకిరీలు బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, తమకు న్యాయం చేయాల్సిన ఎస్సై పోకిరీలకు మద్దతు ఇచ్చారని బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు ఎస్సై శంకర్, సీఐ చర్యలు తీసుకున్నారు. అమర్, మారుతీ, ఉదయ్, రామ్ చరణ్, శశవళి అనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.