ఉప్పల్, వెలుగు: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఇక్కడ చోరీలు షరా మామూలే అన్నట్లుగా మారింది. ఈ నెల 4న సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు స్టేడియంలోకి ప్రవేశించి సోలార్ పవర్, , క్యాట్-6 నెట్వర్క్ డేటా కేబుళ్లను దొంగిలించారు. ఈ డేటా కేబుల్స్ చోరీతో సీసీటీవీ నిఘా వ్యవస్థకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆనంద్ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
