ఉప్పెర్తలో రాయ్​బోస్​ టీ చాలా ఫేమస్​

ఉప్పెర్తలో రాయ్​బోస్​ టీ చాలా ఫేమస్​

టీ... అనేది ఈజీ బిజినెస్ ఆప్షన్​ అయింది చాలామందికి. చదువుతో పనిలేకుండా టీ సెంటర్ పెడుతున్నారు కొందరు.  కొందరేమో చదువుకుంటూనే టీ స్టాల్​ నడిపిస్తున్నారు. కొత్తగా టీ ఫ్రాంఛైజీలు వచ్చాయి కూడా. కానీ, ఈమె టీ తయారుచేయడం వెనక ఒక రీజన్​ ఉంది. అదేంటంటే.. వాళ్ల ఊళ్లో టూరిజాన్ని ప్రమోట్ చేయడం. ఆ ఆలోచన ఆమెను గిన్నిస్​ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈమె పేరు ఇంగార్ వాలెంటిన్.  

దక్షిణాఫ్రికాలోని పర్వత ప్రాంతంలో ఉంది ఉప్పెర్తలో అనే ఊరు. ‘రాయ్​బోస్​ టీ’ కి ఈ ఊరు చాలా ఫేమస్​. ఎరుపు రంగులో ఉండే ఈ టీ ఒక హెర్బల్​ టీ. 2018లో కార్చిచ్చు కారణంగా ఆ  ఊరివాళ్ల ఇండ్లు,  గెస్ట్​హౌస్​లు నేలమట్టమయ్యాయి. వాటిలో వాలెంటిన్ చిన్నప్పుడు ఉన్న ఇల్లు కూడా ఉంది. ఆమె ఉద్యోగం చేసే టూరిజం ఆఫీస్​ కూడా దెబ్బతిన్నది. అంతేకాదు అక్కడి ప్రజలకు ఆదాయం తెచ్చిపెట్టే ‘రాయ్​బోస్’ టీ తోటలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఆ కార్చిచ్చు వల్ల ఒకప్పుడు టూరిస్ట్​ల హబ్​గా ఉన్న ఆ ఊరు కళతప్పిపోయింది. మళ్లీ  అక్కడ కొత్త ఇండ్లు, టీ తోటలు తయారయ్యేందుకు నాలుగేండ్లు పట్టింది. దాంతో టూరిస్ట్​లని మళ్లీ తమ ఊరికి రప్పించాలనుకుంది వాలెంటిన్. టీ పెట్టడంలో ఎక్స్​పర్ట్ అయిన ఆమె  వెరైటీగా టీ చేయాలను కుంది. తమ ఊళ్లో ఎక్కువగా పెరిగే అస్పలాతస్ లీనియరిస్ అనే టీ మొక్క ఆకుల నుంచి ఈ టీ తయారుచేసింది. దీని తయారీలో ఒరిజినల్, వెనిలా, స్ట్రాబెర్రీ అనే మూడు రకాల ఫ్లేవర్స్ వాడింది వాలెంటిన్. 

నిమిషానికి నాలుగు కప్పుల టీ

ఒక్కో కెటిల్​లో 4 టీ బ్యాగ్స్ వేసింది వాలెంటిన్. రాయ్​బోస్ టీ రుచిగా రావడం కోసం  టీ బ్యాగ్స్​ని  రెండు నిమిషాలు వేడినీళ్లలో పెట్టింది. అలా నిమిషానికి 4 టీల చొప్పున తయారు చేసింది వాలెంటిన్. ‘‘కార్చిచ్చు వల్ల అందరం అన్నీ కోల్పోయాం. మా ఊళ్లో చాలామంది రాయ్​బోస్ టీ తోటల్ని నమ్ముకున్నారు. వాళ్లకు భరోసా ఇచ్చేందుకు గంటలో150 కప్పుల టీ తయారు చేయాలను కున్నా. కానీ, 249 కప్పుల టీ చేయడం నాకే ఆశ్చర్యంగా అనిపిం చింది”అంది వాలెంటిన్.