UPSC జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అప్లై చేశారా..?

UPSC జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అప్లై చేశారా..?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ  జులై 17.

పోస్టుల సంఖ్య: 241

పోస్టులు: రీజనల్ డైరెక్టర్ 01, సైంటిఫిక్ ఆఫీసర్ 02, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 08, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 09, మేనేజర్ గ్రేడ్–1/ సెక్షన్ ఆఫీసర్ 19, సీనియర్ డిజైన్ ఆఫీసర్ 07, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 20, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 01, సైంటిస్ట్– బి 05, లీగల్ ఆఫీసర్ 05, డెంటల్ సర్జన్ 04, డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ 02, స్పెషలిస్ట్ 72, ట్యూటర్ 19, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 02, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 08, అసిస్టెంట్ డైరెక్టర్(మైన్స్ సేఫ్టీ) 03, డిప్యూటీ డైరెక్టర్ 02, అసిస్టెంట్ లీగల్ కౌన్సెల్ 14, డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సెల్ 09, అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ 01, నాటికల్ సర్వేయర్ కం డిప్యూటీ డైరెక్టర్ 01, అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ 04, స్పెషలిస్ట్ గ్రేడ్–2(జూనియర్ స్కేల్) 11, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 01, అసిస్టెంట్ డైరెక్టర్ అటార్నీ 09.  

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్​బీ, బీవీఎస్​సీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంఎస్ లేదా ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 నుంచి 50 ఏండ్లు. ప్రతి పోస్టుకు ప్రత్యేకమైన వయోపరిమితులు ఉన్నాయి. అప్లై చేసే అభ్యర్థులు ఆఫీషియల్​ నోటిఫికేషన్​లో పరిశీలించగలరు. 

అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 28.

లాస్ట్ డేట్: జులై 17.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.250. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు upsc.gov.in  వెబ్​సైట్​లో చూడగలరు.