
న్యూఢిల్లీ: డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ ‘అప్‌స్టాక్స్’.. ఐపీఎల్–2021కు అఫీషియల్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం కన్ఫామ్ చేసింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘గ్రోవ్’ ను వెనక్కి నెట్టి అప్‌స్టాక్స్ మూడేళ్లపాటు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ప్రతి ఏడాదికి రూ. 45 కోట్లు చెల్లించనుంది. ఇప్పటికే డ్రీమ్–11, అన్ అకాడమీ, క్రెడ్, టాటా మోటార్స్ అఫీషియల్ పార్ట్‌నర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఐపీఎల్ బోర్డులోకి అప్‌స్టాక్స్ రావడం సంతోషంగా ఉందని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అన్నాడు. మరోవైపు ఐపీఎల్ డిజిటల్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన రైట్స్ కోసం బీసీసీఐ టెండర్స్‌ను ఆహ్వానించింది. ఐపీఎల్ వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్స్‌కు సంబంధించిన రెండు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ)లను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆసక్తిగల పార్టీలు ఈ నెల 31లోగా టెండర్ ఫామ్స్‌ను తీసుకోవచ్చని వెల్లడించింది.