
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐఎల్) మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ, గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 24.
పోస్టుల సంఖ్య: 99.
పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ 17, డిప్లొమా ట్రైనీ 10, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ 72.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బి.టెక్/ బీఈ, డిప్లొమా, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 28 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 25.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ucil.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.