RFCL ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో యూరియా ఉత్పత్తి బంద్

RFCL ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో యూరియా ఉత్పత్తి బంద్
  • కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే చందర్​ ఫిర్యాదు  
  • టీఎస్‌‌‌‌‌‌‌‌పీసీబీ నోటీసు‌‌‌‌లు 
  • డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసిన డబ్బులో రూ.12.50 లక్షలు జప్తు

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫెర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కెమికల్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌) ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో కాలుష్య నియంత్రణ విషయంలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని  తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ బోర్డు (టీఎస్‌‌‌‌‌‌‌‌పీసీబీ) శనివారం రాత్రి నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించనందున, వెంటనే యూరియా ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ ఆపాలని ఆ నోటీస్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నది. అలాగే బ్యాంక్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ కింద డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసిన రూ.25 లక్షల్లో రూ.12.50 లక్షలను జప్తు చేసినట్టు తెలిపింది. దీంతో ఆదివారం ఉదయం నుంచి యూరియా ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిలిపివేసింది.  
వాసనపై కంప్లయింట్​ 
ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో అమోనియా లీక్‌‌‌‌‌‌‌‌ అవుతున్నదని, దాని వాసనకు తట్టుకోలేకపోతున్నామని 2021 జులై 7వ తేదీన పలువురు  పొల్యూషన్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బోర్డు అదే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 15వ తేదీన ప్రత్యేక బృందంతో తనిఖీలు చేపట్టింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 21వ తేదీన పలు సూచనలు చేసింది. అలాగే ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఈ ఏడాది మార్చి 22న రామగుండం ఎమ్మెల్యే  కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ కూడా పీసీబీ ఆఫీసర్లకు కంప్లయింట్​ చేశారు. 

దీంతో అదే నెల 28వ తేదీన రోలింగ్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌, మే 25వ తేదీన పీసీబీ బోర్డు అఫీషియల్స్​ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. 26వ తేదీన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో హియరింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి, 28వ తేదీన రాత్రి నోటీసు ఇష్యూ చేశారు. ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నుంచి అమోనియా కలిసిన నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారని, టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సీవరేజ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మించకుండా ఈ నీటిని కూడా గోదావరిలో నేరుగా కలుపుతూ కలుషితం చేస్తున్నారని ఆ నోటీసులో పేర్కొన్నారు. అమోనియా లీక్‌‌‌‌‌‌‌‌ అయి గాలిలో కలిసిపోతున్నదని, ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో 51 చోట్ల అమోనియా సెన్సార్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టినా అవి పనిచేయడం లేదని, యూరియా డస్ట్ కలెక్షన్ అండ్ రికవరీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ (డీ డస్టింగ్‌‌‌‌‌‌‌‌) లేదని, హీట్‌‌‌‌‌‌‌‌ ఎక్స్ఛేంజర్స్​ ఫెయిల్‌‌‌‌‌‌‌‌ కావడం వల్ల దాని ప్రభావం పర్యావరణంపై పడుతున్నదని పీసీబీ జారీ చేసిన నోటీసులో తెలిపింది. 

 

ఇవి కూడా చదవండి

తాగి బండ్లు నడిపితే కఠిన చర్యలు

మల్లారెడ్డికి నిరసన సెగ

ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స