పవన్ కళ్యాణ్ను సీఎం చేసిన ఊర్వశీ రౌతేలా

పవన్ కళ్యాణ్ను సీఎం చేసిన ఊర్వశీ రౌతేలా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro). తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని(samutirakhani) తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జులై 28 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఈ భామ పవన్ కళ్యాణ్ ను సీఎంగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. "గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరణం తర్వాత తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి రెండవ అవకాశం అందుకున్న అహంకారికి సంబందించిన  కథ ఇది. అంటూ ట్వీట్ చేసింది. 

ఈ ట్వీట్ చుసిన పవన్ ఫ్యాన్స్ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరికొందరేమో ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ అందరు సీఎం.. సీఎం అని అరిచేసరికి నిజంగా పవన్ సీఎం అనుకున్నావా అమ్మడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది.

నేపథ్యంలో ఆమె చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్తూ ఒక ట్వీట్ వేసింది. ట్వీట్ అంతా బావుంది కానీ, ఒక్క విషయంలో మాత్రం ట్రోలర్స్ కు ఆహారంగా మారిపోయింది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ను సీఎం అని అంటూ సంభోదించింది.