ఎఫ్15ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేశాం.. ఇరాన్ ప్రకటనను ఖండించిన అమెరికా

ఎఫ్15ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేశాం.. ఇరాన్ ప్రకటనను ఖండించిన అమెరికా

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు చెందిన మరో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌15ఈ యుద్ధ విమానం కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఈ ఘటనలో పైలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురక్షితంగా బయటపడ్డాడు. 

హార్మూజ్ సమీపంలోని తమ గగనతలంలోకి చొరబడిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారిక మీడియా సంస్థ ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్ఏ ప్రకటించింది. అయితే, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటనను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖండించింది. 

ఆ దేశానివన్నీ అబద్ధాలేనని చెప్పింది. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యూరీలో భాగంగా తమ దళాలు 8 వేల కంటే ఎక్కువసార్లు గగనతల కార్యకలాపాలు నిర్వహించాయని, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడుల్లో ఏ ఒక్క అమెరికా యుద్ధ విమానం కూడా కూలిపోలేదని స్పష్టం చేసింది.