వడ్డీ రేట్లను పెంచిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్

వడ్డీ రేట్లను పెంచిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీరేటును 0.75 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు 1.75 శాతానికి పెరిగాయి. 1994  తర్వాత ఇదే అతిపెద్ద పెంపుకావడం గమనార్హం. ఈ పెంపు వల్ల గృహ, కార్లు సహా ఇతర రుణాలపై ప్రజలకు భారం పడనుంది. అమెరికా ద్రవ్యోల్బణం ఇప్పటికే 40ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో దానిని అదుపుచేసేందుకు ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది.  ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ 2022 వృద్ధి అంచనాను మార్చిలో 2.8 శాతం ప్రకటించగా తాజాగా 1.7 కు తగ్గించింది. ఇక ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికవ్యవస్థ ఆశావహంగానే ఉన్నట్లు ఫెడ్ అధికారులు వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తెచ్చేందుక వడ్డీ రేటు పెంచడం తప్పడంలేదని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు.