మీరు అమెరికాకు ప్రయాణించాలని లేదా అమెరికా నుండి తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోవడం చాల ముఖ్యం. ఎందుకంటే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఇప్పుడు బయోమెట్రిక్ ట్రాకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేస్తూ ప్రకటించింది.
ఈ చర్య డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అక్రమ వలసలను అరికట్టడానికి తీసుకొచ్చింది. యుఎస్ కస్టమ్స్ & బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్‌లో ఈ ప్రతిపాదనను విడుదల చేసింది.
కొత్త రూల్ ప్రకారం, అమెరికాకు వచ్చే లేదా అమెరికా వదిలే వెళ్లే ప్రతి అమెరికా పౌరుడు కాని వ్యక్తి ఫోటో క్యాప్చర్ చేసి ముఖ గుర్తింపు(face recognisation) డేటాబేస్‌లో చేర్చుతారు. ఈ రూల్ ఎయిర్ పోర్ట్స్, సముద్ర మార్గాల ద్వారా అంటే సీ పోర్ట్స్, భూ సరిహద్దు క్రాసింగ్‌లకు(దేశ సరిహద్దులు) వర్తిస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అమెరికాకి వచ్చే సమయంలో సేకరించిన బయోమెట్రిక్ డేటాను అమెరికా వదిలి వెళ్లే సమయంలో సేకరించిన డేటాతో పోల్చి చూస్తుందని CBP చెబుతోంది.
ALSO READ : ఎందుకు అరుస్తున్నవ్..? మీడియా ప్రతినిధులపై ట్రంప్ గరం
ఈ నిర్ణయం ఎందుకు: జాతీయ భద్రతా బెదిరింపులు, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా నకిలీ ట్రావెలో పేపర్స్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉండటం, చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్న విదేశీ పౌరులను పర్యవేక్షించడానికి రూపొందించింది. ఇప్పటివరకు, CBP పరిమిత స్థాయిలో డేటాను సేకరించింది, కానీ ఈ నియమంతో అమెరికా పౌరులు కాని వారందరికీ ఈ ప్రక్రియ తప్పనిసరి అవుతుంది. గతంలో 14 ఏళ్లలోపు పిల్లలు, 79 ఏళ్లు పైబడిన వృద్ధులకు దీని నుండి మినహాయింపు ఉండగా, ఇప్పుడు వారికీ కూడా వర్తిస్తుందని ఏజెన్సీ స్పష్టం చేసింది.
ఈ నియమం ఎవరికి వర్తిస్తుంది: ఈ నియమం వలసదారులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు (permanent residents), దేశంలో ఉండే అక్రమ నివాసితుకు సహా అమెరికా పౌరులు కానీ వారందరికీ వర్తిస్తుంది. దింతో CBPకి అమెరికాకి వచ్చే ప్రయాణికుల ఎంట్రీ & ఎగ్జిట్ సమయంలో వారి ఫోటో తీసి డేటాబేస్‌లో ఎంట్రీ చేసే అధికారం ఉంటుంది. సమాచారం ప్రకారం, అక్టోబర్ 27న ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ చేసిన 60 రోజుల తర్వాత ఈ నియమం అమలులోకి వస్తుంది. అయితే, 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదన చేసారు, దీనిని పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
US ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) ఇప్పటికే కొన్ని విమానాశ్రయాలలో ముఖ గుర్తింపు టెక్నాలజీ ఉపయోగిస్తోంది. అలాగే వేలిముద్రలు, ఫోటోలు కూడా తీసుకుంటుంది, కానీ మీరు దేశం విడిచి వెళ్ళే ప్రతిసారీ ఈ ప్రక్రియ ఇకపై తప్పనిసరి అవుతుంది. ఈ సిస్టం వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండే లేదా తప్పుడు గుర్తింపు కార్డులను ఉపయోగించి ఉంటున్న, వలస నియమాలను తప్పించుకునే విదేశీయులను గుర్తించడం సులభం చేస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుంది.
