కౌలాలంపూర్: మలేసియాలో ఆసియాన్ సమిట్ సందర్భంగా తనను ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గరంగరం అయ్యారు. ఆదివారం ఆసియాన్ వేదికగా బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాతో ట్రంప్ భేటీ అయిన ఈ సందర్భంగా వారిద్దరినీ మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. దీంతో ట్రంప్ విలేకరులపై ఫ్రస్ట్రేట్ అయ్యారు.
ఓ మహిళా జర్నలిస్టును ప్రశ్న అడగకుండా ఆపడంతో మహిళల పట్ల ఆయన వివక్ష చూపుతున్నారన్న విమర్శలు వచ్చాయి. అలాగే ఓ జర్నలిస్టు రెండోసారి ప్రశ్న అడగగా.. మళ్లీ మళ్లీ ఒక్కరే అడగొద్దంటూ ట్రంప్ వారించారు. ఇంకో జర్నలిస్టును ‘‘ఎందుకు అరుస్తున్నారు? అరవొద్దు” అని తీవ్రంగా స్పందించారు.
