వరల్డ్ నెం.1కు షాక్..అయ్యో అల్కరాజ్ ఎంత పనయ్యే !

వరల్డ్ నెం.1కు షాక్..అయ్యో అల్కరాజ్ ఎంత పనయ్యే !


యూఎస్ ఓపెన్లో వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్..డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్కు షాక్ తగిలింది.  అల్కరాజ్ సెమీస్లోనే ఇంటిముఖం పట్టాడు. రష్యా ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్ చేతిలో 7--6, 6-1, 3-6, 6-3 స్కోరు తేడాతో అల్కరాజ్  ఓటమి పాలయ్యాడు.  

హోరాహోరీగా సాగిన పోరులో తొలి సెట్ అతి భీకరంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.  ఇద్దరు ఆటగాళ్లు పదునై సర్వీసులతో ఆటను మరో లెవల్కు తీసుకెళ్లారు. దీంతో తొలి సెట్ టై బ్రేక్ కు దారితీసింది. అయితే టై బ్రేక్లో బ్రేక్ పాయింట్లు సాధించిన మెద్వెదేవ్..ఫస్ట్ సెట్ను 7-6తో దక్కించుకున్నాడు. ఇదే జోరును కొనసాగించిన మెద్వెదేవ్..రెండో సెట్ను 6-1తో సొంతం చేసుకుని ఆధిక్యంతో నిలిచాడు. 

అయితే మూడో సెట్లో అల్కరాజ్ పుంచుకుని ఆ సెట్ను 6-3తో చేజిక్కించుకున్నాడు. కానీ కీలకమైన నాల్గో సెట్లో మాత్రం అల్కరాజ్ ఆ జోరును కొనసాగించలేకపోయాడు. నాలుగో సెట్ను మెద్వెదెవ్ 6-3తో గెలుచుకుని ఫైనల్కు దూసుకెళ్లాడు. 

ఇక సెప్టెంబర్ 11వ తేదీ  సోమవారం జరిగే ఫైనల్లో మెద్వెదెవ్.. వరల్డ్ నెంబర్ 2 సీడ్ నొవాక్ జకోవిచ్తో తలపడనున్నాడు. అటు అర్ధరాత్రి జరిగిన మరో సెమీస్ లో జకోవిచ్ 6-3, 6-2, 7-6తో అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్పై విజయం సాధించాడు.