వొండ్రుసోవాకు షాకిచ్చిన అమెరికా స్టార్‌‌‌‌ మాడిసన్‌‌‌‌ కీస్‌‌‌‌

వొండ్రుసోవాకు షాకిచ్చిన అమెరికా స్టార్‌‌‌‌ మాడిసన్‌‌‌‌ కీస్‌‌‌‌

విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో అమెరికా స్టార్‌‌‌‌ మాడిసన్‌‌‌‌ కీస్‌‌‌‌.. వొండ్రుసోవాకు షాకిచ్చింది. క్వార్టర్‌‌‌‌ ఫైనల్లో 17వ సీడ్‌‌‌‌ కీస్‌‌‌‌ 6-1, 6-4తో 9వ సీడ్‌‌‌‌ వొండ్రుసోవా (చెక్‌‌‌‌)ను చిత్తు చేసి సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించింది. బలమైన సర్వీస్‌‌‌‌లతో ఆకట్టుకున్న కీస్‌‌‌‌ 4 ఏస్‌‌‌‌లు, 3 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసింది. వచ్చిన మూడు బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాచుకుంది. 19 విన్నర్లతో చెలరేగింది. 

ఇక ఒక్క బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ కూడా సాధించని వొండ్రుసోవా 5 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 19 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌తో మూల్యం చెల్లించుకుంది. మరో మ్యాచ్‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌ సబలెంక (బెలారస్‌‌‌‌) 6-1, 6-4తో క్విన్‌‌‌‌వెన్‌‌‌‌ జెంగ్‌‌‌‌ (చైనా)పై గెలిచింది. గంటా 13 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో సబలెంక మూడు ఏస్‌‌‌‌లు, మూడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసింది. ఏడు బ్రేక్‌‌‌‌ పాయింట్లలో మూడింటిని కాపాడుకుంది. ఒక్క బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ కూడా సాధించలేని జెంగ్‌‌‌‌ 16 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసింది.