అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కు కరోనా పాజిటివ్

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కు కరోనా పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ 19 స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ప్రస్తుతం అధ్యక్ష భవనంలోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొంది. అయితే అక్కడి నుంచే ఆయన తన విధులను నిర్వర్తిస్తారని తెలిపింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్న బైడెన్ కు కరోనా రావడం గమనార్హం.