సిటీలో పీఐ స్క్వేర్​ సెంటర్​.. 300 మందికి ఉద్యోగాలు

సిటీలో పీఐ స్క్వేర్​ సెంటర్​.. 300 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్​, వెలుగు: యూఎస్​ టెక్నాలజీ కంపెనీ పీఐ స్క్వేర్​ హైదరాబాద్​లో గ్లోబల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ప్రారంభించింది. ఫార్చూన్​ 500 జాబితాలోని చాలా కంపెనీలకు తాము సేవలందిస్తున్నామని ఈ సందర్భంగా పీఐ స్క్వేర్​ తెలిపింది. డేటా సైన్స్​, ఎనలిటిక్స్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, ఐఓటీ, సైబర్​ సెక్యూరిటీ, యానిమేషన్​, వీఎఫ్​ఎక్స్​, సీజీఐ, ఏఆర్, వీఆర్​ వంటి టెక్నాలజీలపై ఫోకస్​ పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ గ్లోబల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్​ రంజన్​ ప్రారంభించారు. 

మాదాపుర్​ హైటెక్​సిటీ వద్ద ఏర్పాటయిన ఈ సెంటర్​లో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులుంటారని, రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్యను 1,000 కి పెంచుతామని పీఐ స్క్వేర్​ తెలిపింది. సెంటర్లో హార్న్​బిల్​ స్టూడియో పేరిట యానిమేషన్ స్టూడియో కూడా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్​లో గ్లోబల్ డెలివరీ సెంటర్​ పెట్టడానికి అనేక విదేశీ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయని జయేష్​ రంజన్​ చెప్పారు. యానిమేషన్​ ఇండస్ట్రీ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు. మెటావర్స్​ వంటి కొత్త టెక్నాలజీలలో యానిమేషన్​, వీఎఫ్​ఎక్స్​ ముఖ్యపాత్ర పోషిస్తాయని కంపెనీ సీఈఓ శ్రీనివాస్​ రాజు చెప్పారు.