తెలుగమ్మాయి చావు ఖరీదు 11 వేల డాలర్లు : అమెరికా పోలీస్ అహంకారపు మాటలు

తెలుగమ్మాయి చావు ఖరీదు 11 వేల డాలర్లు : అమెరికా పోలీస్ అహంకారపు మాటలు

అమెరికాలో ఓ ఇండియన్ యువతి అక్కడి పోలీసుల చేత చంపబడింది. సౌత్ లేక్ యూనియన్ లోని సీటెల్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో చనిపోయింది 23 యేళ్ల జాహ్నవి కందుల సియాటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ ధృవీకరించింది. 2023 జనవరి 24న జరిగిన ఈ ఘటన అనంతరం పోలీస్ అధికారి వెకిలిగా, నవ్వుతున్న షాకింగ్ పుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ అధికారి బాడీ క్యామ్ ఫుటేజ్ అతని అనుచిత వ్యాఖ్యలను క్యాప్చర్ చేసింది. అతడి అసహ్యంగా అమానవీయంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  

Also Read :- రెండు డ్యాంలు కూలిపోయాయి.. ఊర్లు మునిగాయి.. 5 వేల మంది జలసమాధి

ఆమె సాధారణ వ్యక్తి రూ. 11వేల డాలర్ల చెక్కు ఇస్తే సరిపోతుంది.. ఆమెది లిమెటెడ్ లైఫ్.. అందుకే 26 యేళ్ల వయసులో చనిపోయింది. ’’ అంటూ విద్యార్థి ప్రాణాలు బలిగొన్న ఘటన తర్వాత పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు, అతని భయంకరమైన నవ్వు అందరిని కలచివేస్తోంది. అత్యంత విషాదకమైన ఘటన, అవహేళనకు సంబంధించిన ఐ బాడీ క్యామ్ ఫుటేజ్ ని అక్కడి న్యూస్ ఛానెల్ బయటపెట్టింది. ఈ ఫుటేజ్ చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.