అరుదైన రికార్డ్ : ఒకే కాన్పులో ఆరుగురు

అరుదైన రికార్డ్ : ఒకే కాన్పులో ఆరుగురు

ఒకే కాన్పులో కవలు పుడితేనే ఆశ్చర్యపోతాం. ముగ్గురు, నలుగురు, ఐదుగురు అయితే రికార్డుగా చెబుతాం. అలాంటిది ఒకే కాన్పులో ఓ మహిళ ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన యూఎస్ లోని టెక్సాస్ లో జరిగింది. ఈ అరుదైన ఘటన 4.7 బిలియన్ మందిలో ఒక్కరికే జరుగుతుందట. అంటే 470 కోట్ల మందిలో ఒక్కరు మాత్రమే అలా జన్మనివ్వగరట.  టెక్సాస్‌లో ఉన్న వుమెన్స్ హాస్పిటల్‌ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుట్టిన ఆరుగురిలో నలుగురు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. ఈ డెలివరీని సెక్స్‌ టప్లెట్స్ అని అంటారట. సిక్స్ టప్లెట్ అంటే ఒకే డెలివరీలో ఆరుగురు పిల్లలకు జన్మనివ్వడం.

హస్పిటల్ వర్గాల సమాచారం ప్రకారం.. ముందుగా ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత మరో ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత ఇద్దరు ఆడబిడ్డలకు ఆ మహిళ జన్మనిచ్చిందట. ప్రస్తుతం ఆరుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు.  ఉదయం 4.50 నుంచి 4.59 వరకు 9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి తెల్మా చియాక ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు.