ఈసారి పాక్ ఎన్ని ముక్కలు అయితదో ఆ దేవుడికే తెలియాలి: పాకిస్తాన్‎కు రాజ్‎నాథ్ సింగ్ వార్నింగ్

ఈసారి పాక్ ఎన్ని ముక్కలు అయితదో ఆ దేవుడికే తెలియాలి: పాకిస్తాన్‎కు రాజ్‎నాథ్ సింగ్ వార్నింగ్

న్యూఢిల్లీ: భవిష్యత్‎లో భారత్‎తో యుద్ధం వస్తే ఈసారి కోల్‎కతాను లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ బెంగాల్‌పై కన్నేస్తే ఈ సారి దాయాది దేశం ఎన్ని ముక్కలు అయితదో ఆ దేవుడికే తెలియాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలతోనే ఆ దేశం రెండు ముక్కలైందని పాకిస్తాన్ కు గతాన్ని గుర్తు చేశారు. 

 మంగళవారం (ఏప్రిల్ 7) రాజ్‎నాథ్ సింగ్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యారు. “పాకిస్తాన్ రక్షణ మంత్రి అంత రెచ్చగొట్టే ప్రకటన చేసి ఉండకూడదు. 55 ఏళ్ల క్రితం పాకిస్తాన్ రెండు భాగాలుగా విడిపోయినప్పుడు వారు దాని పర్యవసానాలను అనుభవించారు. వాళ్లు ఇప్పుడు బెంగాల్‎పై కన్నేస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో దేవుడికే తెలియాలి” అని రాజ్‎నాథ్ సింగ్ హెచ్చరించారు.

పాక్ మినిస్టర్ ఏమన్నారంటే..?

భారత్ ఈసారి పాకిస్తాన్‎పై ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే తమ ప్రతిస్పందన సరిహద్దుల వరకే పరిమితం కాదని.. ఇండియా లోపలికి చొచ్చుకెళ్లి మరీ అటాక్స్ చేస్తామని పాక్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా ప్రగల్భాలు పలికారు. ఇండియా ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే ఈసారి తమ టార్గె్ట్ కోల్‎కతా అవుతుందని.. భారతీయుల ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని బలుపు కూతలు కూశాడు. పాక్ మంత్రి వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. 

ALSO READ : కోటి 40 లక్షల మంది చావటానికి సిద్ధంగా ఉన్నా

కోల్‎కతాను లక్ష్యంగా చేసుకుంటామని పాక్ మంత్రి బహిరంగంగా హెచ్చరిస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని దీదీ ప్రశ్నించారు. పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలపై స్పందించే ధైర్యం ప్రధాని మోడీకి లేదని హాట్ కామెంట్ చేశారు. బెంగాల్ ఎన్నికలకు ముందే పహల్గామ్ తరహా దాడికి బ్లూప్రింట్ సిద్ధంగా ఉందా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకోవడం సులభం కాబట్టే మోడీ సైలెంట్‎గా ఉన్నారని ఆరోపించారు. ఎవరైనా బెంగాల్ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటే, బెంగాల్ ఢిల్లీని లక్ష్యంగా చేసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.