MI vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR)తో పుంజుకోవాలని చూస్తున్న ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య ఈరోజు (2026, ఏప్రిల్ 7న) కీలక పోరు జరగబోతుంది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ లాంటి స్టార్ బ్యాటర్లతో పాటు జోఫ్రా ఆర్చర్ లాంటి పేసర్లతో జట్టు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ గెలిచినా, రెండో మ్యాచ్‌లో ఓడిపోయి కొంచెం వెనుకబడింది. అయితే హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడం ముంబైకి కొండంత బలాన్నిస్తోంది.
పిచ్ రిపోర్ట్:
గౌహతి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని బౌలింగ్ తీసుకుంటాడు. రాత్రి పూట మంచు (Dew) ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా తేలికవుతుంది. ఈ స్టేడియంలో లక్ష్యాన్ని ఛేదించే జట్లకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తుది జట్ల అంచనా:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, నాంద్రే బర్గర్.
ఇంపాక్ట్ ప్లేయర్: రవి బిష్ణోయ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.
ఇంపాక్ట్ ప్లేయర్: మయాంక్ మార్కండే
