హెల్దీగా ఉండాలంటే సీజన్ కి తగ్గ జ్యూస్ లని డైట్ లో చేర్చాలి. అవి వెజిటబుల్ జ్యూస్లైతే మరీ మంచిది. పచ్చి కూరగాయల్లో న్యూట్రియెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా బీట్రూట్ జ్యూస్ చాలా మేలు చేస్తుంది. రీసెంట్ గా యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ స్టడీలో తేలింది కూడా ఇదే.
26 మంది నడివయసు వాళ్లపై జరిగింది. ఈ స్టడీ, స్టడీలో భాగంగా ఈ 26 మందిని రెండు గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూప్ కి రోజుకి రెండు సార్లు చొప్పున నైట్రేట్ రిచ్ బీట్ రూట్ జ్యూస్ ఇచ్చారు. మరో గ్రూప్ కి నైట్రేట్ ఫ్రీ ప్లాసిబో జ్యూస్ ఇచ్చారు. రిజల్ట్స్ చూస్తే బీట్ రూట్ జ్యూస్ తాగిన వాళ్ల రక్తనాళాలు, మెదడు పని తీరు మెరుగుపడింది. అంతేకాదు. బీట్రూట్ జ్యూస్ తాగిన వాళ్ల బ్లడ్ ప్రెజర్ ఐదు పాయింట్స్ తగ్గింది. దీనికి కారణమేంటంటే బీట్ రూట్ లో ఇన్ ఆర్గానిక్ నైట్రేట్, ఓరాల్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.
Also Read : ఇంట్లోనే కేవలం 7 నిమిషాలు కేటాయిస్తే చాలు
ఇవి రెండూ కలిస్తే నైట్రేట్ ని , నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తాయి. ఆ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు, మెదడు పనితీరును వేగవంతం చేసింది. అంతేకాదు వయసు ఛాయల్ని కూడా తగ్గించింది.
