బిర్యానీ ఆకుతో చుండ్రు మాయం

బిర్యానీ ఆకుతో చుండ్రు మాయం

బిర్యానీ ఆకును బిర్యానీ చేయడానికే కాదు.. ఫేస్‌‌‌‌‌‌‌‌ సీరమ్‌‌‌‌‌‌‌‌లా, జుట్టుకు కండీషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా, చుండ్రు తగ్గించేందుకూ వాడొచ్చు. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌‌‌‌‌‌‌‌ గుణాలు ముఖంపైన ముడతలు, మచ్చలు రాకుండా, జుట్టు రాలకుండా చేస్తాయంటున్నారు హెల్త్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌.
  

  • కొన్ని బిర్యానీ ఆకులు, అనాస పూలను మిక్సీలో వేసి పొడి చేయాలి. ఒక గిన్నెలో అరకప్పు ఆలివ్‌‌‌‌‌‌‌‌ నూనె వేసి, అందులో బిర్యానీ ఆకు, అనాస పూల పొడి వేసి బాగా కలపాలి. ఒక పాన్‌‌‌‌‌‌‌‌లో నీళ్లు పోసి ఆ గిన్నె సగం మునిగేలా పాన్‌‌‌‌‌‌‌‌లో ఉంచాలి. తరువాత పొయ్యి వెలిగించి, పది నిమిషాలు మరిగించాలి. చల్లారాక ఒక టేబుల్‌‌‌‌‌‌‌‌ స్పూన్‌‌‌‌‌‌‌‌ విటమిన్‌‌‌‌‌‌‌‌ ఇ, బాదం నూనె వేసి బాగా కలపాలి. ఇది నెల రోజులు నిల్వ ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు ముఖం కడుక్కొని, నాలుగైదు చుక్కలు ముఖానికి రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.  ఇది చర్మం పొడిబారడాన్ని కూడా తగ్గిస్తుంది. 
  • ఒక గిన్నెలో కొన్ని బిర్యానీ ఆకులు వేసి పది నిమిషాలు మరిగించాలి. ఈ నీళ్లను తలస్నానం చేశాక కండీషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఉపయోగిస్తే జుట్టు మృదువుగా అవుతుంది. ఈ ఆకును పొడి చేసి కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.