హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వానికి సిగ్గు రాలేదా?

హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వానికి సిగ్గు రాలేదా?

హైదరాబాద్, వెలుగు: కరోనా కట్టడిలో ప్రభుత్వం నిరక్ష్ల్యంగా వ్వవహరిస్తోందని, కరోనా నియంత్రణ విషయంలో హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, చీవాట్లుపెట్టినా పద్దతి మార్చు కోలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డివిమర్శించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎన్ని మంచి సలహాలు ఇచ్చినా రాజకీయ దురుద్దేశంతో తమపైనే విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తమ్ఓ ప్రకటన విడుదల చేశారు.

కరోనా బులెటిన్లలో దొంగ లెక్కలు చెబుతూ వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతుందని ఉత్తమ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ కరోనా విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, కరోనా అసలు తెలంగాణకు రాదని, పారాసిటమాల్ గోలి వేసుకుంటే తగ్గిపోగ్గితుందని అన్నారని గుర్తు చేశారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా మండిపోతుందని అవగాహన లేకుండా, అశాస్త్రీయంగా మాట్లాడారని చెప్పారు. రాష్ట్రంలో డాకర్టకు, మెడికల్ స్టాప్ కు  కనీసం పీపీఈ కిట్లుకూడా అందించలేదని, దేశంలోనే అతి తక్కువ కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశారనిచెప్పారు. కరోనా మరణాల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతునారని ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు వెంకట్ ఈఎస్ఐస్మశానవాటికలో ఒకేరోజు 60 శవాలు దహనం చేస్తున్న వీడియోలను, ఫొటోలను బయట పెట్టిన తర్వాతే అసలు విషయాలు బయటికి వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల తరఫున ప్రతిపక్షాలు, మీడియా నిరంతరం పోరాడాలని, వారికికాంగ్రెస్ అండగా ఉంటుందని ఉత్తమ్ చెప్పారు.