కుక్కలు అని దిగజారి మాట్లాడినా పట్టించుకోరా..

కుక్కలు అని దిగజారి మాట్లాడినా పట్టించుకోరా..

తెలంగాణలో ప్రజాస్వామ్యం దెబ్బతిందని..పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పై పాలకుల పెత్తనం పెరిగిపోయిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యలు, ప్రతిపక్ష నేతల వార్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. వ్యయసాయ బిల్లుల వల్ల ఎలాంటి నష్టం లేదని  మోడీపదే, పదే చెప్తున్నారని… మోడీ, అమిత్ షా లను కలిసాక కేసీఆర్ తెలంగాణలో పంటల కొనుగోలు కేంద్రాలను రద్దు చేశారన్నారు.  వ్యవసాయ బిల్లుల వల్లనే కొనుగోలు కేంద్రాలు రద్దు చేశామని కేసీఆర్ అంటున్నా…ఈ విషయాన్ని మీడియా ఎక్కువగా ప్రచారం చేయలేదన్నారు. ఇదే విషయంపై తాను లోకసభలో మాట్లాడినా కూడా పెద్దగా ప్రచురణ కాలేదన్నారు. హాలియ సభలో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వారిని సీఎం కేసీఆర్ కుక్కలు అని దిగజారి పోయి మాట్లాడినా కూడా పత్రికలలో పెద్దగా రాలేదన్నారు.

see more news

మిస్ ఇండియాగా తెలంగాణ యువతి

దిశ కేసులో కొత్త ట్విస్ట్.. లారీ ఓనర్ పై అనుమానాలు

సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగిన చిట్యాల సీఐ

ఐపీఎల్ వేలం ముందు అర్జున్ టెండుల్కర్ కు ఎదురుదెబ్బ