యూపీ పోలీస్ నియామక బోర్డు చైర్ పర్సన్ తొలగింపు

యూపీ పోలీస్ నియామక బోర్డు చైర్ పర్సన్ తొలగింపు

న్యూఢిల్లీ: కానిస్టేబుల్ పేపర్ లీకేజీ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్ పర్సన్ రేణుకా మిశ్రాను ఆ పదవి నుంచి మంగళవారం తొలగించింది. ఆమె స్థానంలో ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ కృష్ణాను నియమించింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఫిబ్రవరిలో 17, 18న పరీక్షలు నిర్వహించింది. 48 లక్షల మందికి పైగా పరీక్షలు రాశారు.

అయితే పేపర్ లీక్ ఆరోపణలతో కానిస్టేబుల్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఫిబ్రవరి 24న ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ 6 నెలల్లో ఎగ్జామ్ పెడతామని తెలిపింది. ఈ కేసు విచారణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. కాగా, పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఆ విషయంలో రాజీపడబోమని సీఎం యోగి ఇటీవల తెలిపారు.