అబ్బెబ్బే ఏంటీ సిట్టింగ్ : పన్నీర్ ఇలా చేస్తారా.. ఏదేదో గుర్తుకొస్తుందన్న నెటిజన్లు

అబ్బెబ్బే ఏంటీ సిట్టింగ్ : పన్నీర్ ఇలా చేస్తారా.. ఏదేదో గుర్తుకొస్తుందన్న నెటిజన్లు

మీకు పన్నీర్ అంటే ఇష్టమా... అయితే పన్నీర్ కు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. పన్నీర్ తయారీ సమయంలో పన్నీర్‌పై కూర్చున్న ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇది పరిశుభ్రత గురించి ప్రజలను కలవరపెట్టేందుకు దారి తీసింది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి వచ్చినట్లు సమాచారం.

పోస్ట్ వైరల్..

ఒక X యూజర్ ఈ ఫొటోతో పాటు.. నాన్-బ్రాండెడ్ పన్నీర్‌లను అస్సలు కొనుగోలు చేయకూడదనే క్యాప్షన్ ను జోడించాడు. అక్టోబర్ 28న రాత్రి Xలో పోస్ట్ అయిన ఈ ఫొటోకు ఇప్పటివరకు 58వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో బ్రాండెడ్ ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుందని పలువురు సూచించారు. ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : 60 ఏళ్ల చరిత్రకు ముగింపు : ముంబైలో ఎల్లో, బ్లాక్ ట్యాక్సీలకు గుడ్ బై

ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని కాకుండా బయటి ఆహారాన్ని అంత ఈజీగా నమ్మకూడదని నెటిజర్లు సూచిస్తున్నారు. మరికొందరేమో అతనికి మద్దతు తెలిపారు. పన్నీర్ పై ఉన్న వస్తువుపై అతను కూర్చున్నాడు.. అంతే గానీ పన్నీర్ పై కూర్చోలేదు కదా.. ఇందులో తప్పేం ఉందని అంటున్నారు.