60 ఏళ్ల చరిత్రకు ముగింపు : ముంబైలో ఎల్లో, బ్లాక్ ట్యాక్సీలకు గుడ్ బై

60 ఏళ్ల చరిత్రకు ముగింపు : ముంబైలో ఎల్లో, బ్లాక్ ట్యాక్సీలకు గుడ్ బై

ముంబైవీధుల్లో ఇకపై ఎల్లో,బ్లాక్ ట్యాక్సీలు కనిపించవు.. 60 యేళ్ల చరిత్ర ఉన్న ఈ ట్యాక్సీలు.. బాలీవుడ్ తారలు, ప్రముఖులకు, అటు వ్యాపారవేత్తలకు ఆరు దశాబ్ధా లుగా సేవలందించాయి. కాళీ-పీలీ ట్యాక్సీలుగా పిలువబడుతున్న ఎల్లో, బ్లాక్ ట్యాక్సీలను బ్యాన్ చేసింది ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ. సో..ఇకపై ముంబై అంటే వెంటనే గుర్తుకొచ్చే ఐకానిక్ కాలీ-పీలీ ట్యాక్సీలు కనిపించవు. ఇటీవల ముంబై స్పెషల్ లెజెండరీ రెడ్ బెస్ట్ డబుల్ డెక్కర్  బస్సును రద్దు చేసిన ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ.. కాలపరిమితి తీరడంతో తాజాగా మరో ముంబై తీపీ జ్ఞాపకం.. కాలీ-పీలీ ట్యాక్సులకు ఉద్వాసన పలికింది. 

ప్రీమియర్ పద్మిని గా పిలువబడే ఈ ఎల్లో, బ్లాక్ ట్యాక్సీలు 2003 అక్టోబర్ 29న  ఆర్టీయేలో రిజిస్టర్ చేయబడ్డాయి. ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ వీటి వయసును 20 యేళ్లుగా నిర్ణయించారు. నేటితో (అక్టోబర్ 30 2023) వీటి కాల పరిమితి ముగియనుంది. 

Also Read : వాయు కాలుష్యం.. పరిశుభ్రమైన గాలి ఉన్న టాప్ 10 ప్రదేశాలు

ముంబై నగరంలో ఆరు దశాబ్దాలుగా విశిష్ట సేవలందించిన కాళీ-పీలీ ట్యాక్సీలు అక్టోబర్ 30 నుంచి ముంబై రోడ్లపై కనిపించవు. నగర వాసుల జీవితాల్లో అంతర్భాగమైన ఈ ట్యాక్సీలు 1964లో ఫియట్ 1100 డిలైట్ పేరుతో  పరిచయమయ్యాయి.  ఆ రోజుల్లో నడిచే ఫ్లైమౌత్, ల్యాండ్  మాస్టర్, డాడ్జ్ వంటి పెద్ద ట్యాక్సీలతో పోలిస్తే ఫియట్ 1100  చాలా చిన్నది. తర్వాత 1970లో వీటిని  ప్రీమియర్ ప్రెసిడెంట్ పేరుతో రీ బ్రాండ్ చేశారు. ఆ తర్వాత ప్రీమియర్ పద్మిని గా మార్చారు.

కాళీ-పీలీలు కేవలం ప్రయాణమార్గంలోనే కాదు.. నగరం సాంస్కృతిక వారసత్వంలోనూ అంతర్భాగమయ్యాయి. ఈ ట్యాక్సీల పేరుతో ‘‘ట్యాక్సీ నంబర్ 9211’’, ‘ఆ అబ్ లౌట్ చలే’ వంటి బాలీవుడ్ చిత్రాలు కూడా నిర్మించారు. అప్పట్లో అనేక పాత బాలీవుడ్ చిత్రాల్లో ప్రీమీయర్ పద్మిన కార్లు, డబుల్ డెక్కర్ బస్సులు మొంబై కి సింబల్ గా సినిమాల్లో ప్రారంభ షాట్ లో చూపించారు. 

అంతటి చరిత్ర ఉన్న కాళీ పీలీ ట్యాక్సీలు నేటి నుంచి ముంబై నగరంలో కనిపించవు.. వీటి వయసు అయిపోయింది.. ఇటీవల కాలంలో డబుల్ డెక్కర్ బస్సులకు స్వస్తి పలికిన ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ తాజా.. కాళీ పీలీ ట్యాక్సీలు పిలువబడే ప్రీమియర్ పద్మినీ కార్లకు ఉద్వాసన పలికింది.