వాయు కాలుష్యం.. పరిశుభ్రమైన గాలి ఉన్న టాప్ 10 ప్రదేశాలు

వాయు కాలుష్యం.. పరిశుభ్రమైన గాలి ఉన్న టాప్ 10 ప్రదేశాలు

వాయు కాలుష్యం 21వ శతాబ్దంలో అతిపెద్ద పర్యావరణ ఆరోగ్య ప్రమాదాలలో ఒకటిగా ఉద్భవించింది. ఇది ముఖ్యంగా మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు, వాతావరణంలోని కాలుష్య కారకాలు వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన గ్రహం మీద నివసిస్తున్న మిలియన్ల జాతుల ఉనికిని ఈ వాయు కాలుష్యం శాసిస్తోంది. కాగా తాజాగా భారత్‌లో గాలి నాణ్యతపై ఓ నివేదిక విడుదలైంది. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్ భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరాలుగా ఉండగా.. మిజోరంలోని ఐజ్వాల్ భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉంది. 2019 కంటే తక్కువ కాలుష్యాన్ని నమోదు చేసినప్పటికీ, ఢిల్లీ ఇప్పటికీ అత్యంత కాలుష్య నగరంగా ఉంది. అయితే, కర్ణాటకలోని ఎనిమిది నగరాల్లో స్వచ్ఛమైన గాలి ఉంది. ప్రస్తుత ర్యాంకింగ్‌లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఇప్పటికీ అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఉంది.  

భారతదేశంలోని 10 పరిశుభ్రమైన నగరాలు

గాలి నాణ్యత డేటాను విశ్లేషించే రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ అండ్ క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం, స్వచ్ఛమైన గాలి ఉన్న టాప్ 10 స్థానాల్లో కర్ణాటక ఆధిక్యంలో ఉంది. వాటిలో ఐజ్వాల్ పరిశుభ్రమైన గాలిని కలిగి ఉంది. ఆ తర్వాత కర్ణాటకలోని చిక్కమగళూరు ఉంది. మూడో స్థానంలో హర్యానాలోని మండిఖేరా, తర్వాతి స్థానాల్లో చామరాజనగర్, మడికేరి, విజయపుర, రాయచూర్, శివమొగ్గ, గడగ్, కర్ణాటకలోని మైసూరు ఉన్నాయి.

ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం

PM2.5 స్థాయిల ప్రకారం ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉన్న 21 భారతీయ నగరాల్లో ఘజియాబాద్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం, గాలి నాణ్యత పరంగా ఉత్తర భారతదేశం మరోసారి ఈ సంవత్సరంలో అత్యంత అధ్వాన్నమైన కాలం వైపు పయనిస్తోంది. భారతదేశంలో వాయు కాలుష్యం ప్రతిచోటా ఉందని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా నగరాలు.. తమ ప్రాంతాల్లో గాలిని శుభ్రంగా ఉంచడంలో విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.