ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..ఇండియన్లపై రేసిస్ట్ అటాక్

ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..ఇండియన్లపై రేసిస్ట్ అటాక్
  • ఓ ఫుడ్ బ్యాంక్ క్యూలైన్  ఫొటోపై సోషల్ మీడియాలో దుమారం

డబ్లిన్/కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్రా: ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరుగుతున్నాయి. గాల్వే వర్సిటీ విద్యార్థులు నిర్వహిస్తున్న 'స్పెయిర్ స్టూడెంట్ ప్యాంట్రీ' అనే ఫుడ్ బ్యాంక్ గురించి 'ది ఐరిష్ టైమ్స్' పత్రిక ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. దేశంలో పెరిగిన ధరల వల్ల స్టూడెంట్లు పడుతున్న ఇబ్బందులను వివరించింది. 

ఓ ఫుడ్ బ్యాంక్ వద్ద విద్యార్థులు క్యూలో నిలబడిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో వివిధ దేశాలకు చెందిన స్టూడెంట్లు ఉన్నప్పటికీ కొందరు ఇండియన్లను, దక్షిణ ఆసియా మూలాలున్న విద్యార్థులనే టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు.“ఉచిత ఆహారం కోసం విదేశీ విద్యార్థులే క్యూ కడుతున్నారు, భారతీయులను దేశం నుంచి పంపించేయాలి, వీరు ప్రభుత్వ వ్యవస్థలను దోచుకుంటున్నారు, ఇమ్మిగ్రెంట్స్ దొంగలు” అంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి

ఆస్ట్రేలియాలోనూ భారతీయులపై జాత్యాహంకార కామెంట్లు ఎక్కువవుతున్నాయి. థామస్ సెవెల్ (32) అనే ఒక నియో-నాజీ యాక్టివిస్ట్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.