ట్రాఫిక్ రూల్స్​పై యోగాతో అవగాహన

ట్రాఫిక్ రూల్స్​పై యోగాతో అవగాహన
  • యూపీ పోలీసుల సరదా పోస్టులు ​

లక్నో: యోగా డే రోజు యూపీ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. యోగాసనాలతో కూడిన పోస్టులు పెట్టి సరదాగా అవేర్నెస్​ కల్పించారు. ఒక పోస్ట్‌‌‌‌లో యోగా భంగిమలో ఉన్న వ్యక్తుల చిత్రాన్ని పోస్ట్​ చేసి  'వాహన్ మే అనుష్ ఆసన్' పేరుతో డ్రైవింగ్ చేసేటప్పుడు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. రెడ్ లైట్లు, రైల్వే ట్రాక్‌‌‌‌లు, జీబ్రా క్రాసింగ్‌‌‌‌ల వద్ద విశ్రాంతి తీసుకోవాలని ఆ ట్వీట్​లో అవగాహన కల్పించారు.

మరో ట్వీట్‌‌‌‌లో.. రెడ్​ సిగ్నల్​పడగానే నెమ్మదిగా శ్వాస తీసుకోవాలని, పసుపు రంగులోకి మారినప్పుడు శ్వాసను బంధించాలని, గ్రీన్​లైట్​పడగానే నెమ్మదిగా ఊపిరి వదలాలని సూచించారు. ఇంకో పోస్ట్​లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే.. హెడ్‌‌‌‌స్టాండ్ లేదా 'శిర్షాసనం'  తో పోల్చారు. ఇది చివరికి శవాసనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.