మూతపడ్డ కేదార్నాథ్ ఆలయం.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే.?

మూతపడ్డ కేదార్నాథ్ ఆలయం.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే.?

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయం  మూతపడింది. శీతాకాల ప్రారంభం కావడంతో నవంబర్ 3 న ఉదయం 8:30 గంటలకు ఆలయం తలుపులు   మూసివేశారు.  శీతాకాలంలో ఆలయం మంచులో కూరుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పూజారులు గుడి తలుపులు మూసివేశారు. ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్ కు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో జై బోలో శంకర్ నినాదాలు చేస్తూ  వేలాది మంది భక్తులు స్వామివారి వెంట నడిచారు. వచ్చే 6 నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు నిర్వహించనున్నారు.

ALSO READ : వారఫలాలు (సౌరమానం) నవంబర్ 03 నుంచి నవంబర్ 09 వరకు

కేదార్నాథ్ తో పాటు ఉత్తర కాశీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యమునోత్రి ధామ్ ఆలయం కూడా నవంబర్  2 న మూతపడింది. వచ్చే ఆరు నెలల వరకు ఆలయం మూసి ఉంటుంది. యమునా దేవి గుడిని మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేశారు. చార్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17 న మూసివేస్తారు. హిమపాతం, శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా, ఏటా అక్టోబర్ -నవంబర్ మాసాల్లో  చార్ ధామ్ లు మూసివేసి వచ్చే ఏడాది 2025  సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు.