నాకు చెప్పకుండానే మంత్రివర్గం నుంచి తప్పించారు

నాకు చెప్పకుండానే మంత్రివర్గం నుంచి తప్పించారు

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్నాయి. ఈ సమయంలో పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా మంత్రి వర్గం నుంచి హరక్ సింగ్ రావత్‌ను బీజేపీ ప్రభుత్వం ఆదివారం తొలగించింది. అంతేకాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను రావత్‌ను ఆరేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి బీజేపీ తొలగించింది. దీనిపై స్పందించిన రావత్.. తనను మంత్రివర్గం నుంచి తప్పించడంపై భావోద్వేగానికి లోనయ్యానన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పార్టీ ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్‎లో చేరాలనుకుంటే నాలుగేళ్ల క్రితమే బీజేపీకి రాజీనామా చేసేవాడినన్నారు. మంత్రిపదవిపై తనకు ఎప్పుడూ ఆసక్తి లేదన్నారు హరక్ సింగ్ రావత్.

కాగా.. మంత్రివర్గం నుంచి హరక్ సింగ్ రావత్‎ను బహిష్కరించడంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. హరక్ సింగ్ రావత్ తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెచ్చారన్నారు. కానీ ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఆ విధానానికి భిన్నంగా హరక్ సింగ్ టికెట్లు అడిగారని పుష్కర్ సింగ్ చెప్పారు.

For More News..

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖబర్దార్.. హెచ్చరించిన టీఆర్ఎస్ సర్పంచ్ భర్త

మునిగిన ఊరిలో సంక్రాంతి సంబురాలు