వీ6, వెలుగు కథనంపై స్పందించిన అధికారులు

వీ6, వెలుగు కథనంపై స్పందించిన అధికారులు
  • పెన్ గంగా నదిలో ముమ్మర తనిఖీలు
  • అడ్డుకట్టల తొలగింపు..వాహనాలు సీజ్..

ఆదిలాబాద్ జిల్లా పెన్ గంగా పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై వీ6, వెలుగు వరుస కథనాలతో అధికారులు స్పందించారు. సాంగ్వి-కె, డొల్లరా దగ్గర రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. పెన్ గంగా ప్రవాహానికి ఇసుక మాఫియా వేసిన అడ్డుకట్టలను అధికారులు తొలగించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు వాహనాలు సీజ్ చేశారు. సాంగిడి, బెదోడా, కోబ్దూర్ లో రెవెన్యూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 
అనుమతి లేని పెన్ గంగా నదిలో అక్రమంగా నడుస్తున్న ఇసుక తవ్వకాలపై నిన్న వరుస కథనాలు ప్రసారం చేసింది వీ6. వీడీసీల పేరు చెప్పి లక్షల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా దోచుకెళ్తున్నారు. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మరీ భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారు. తాంసి మండలం నుంచి బేల మండలం వరకు పెన్ గంగ ప్రవహిస్తుంది. దాదాపు అన్ని తీర గ్రామాల్లో ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి.
గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ఇసుక క్వారీలకు టెండర్లు
ఇసుక మైనింగ్ కు సర్కార్ అనుమతి ఇవ్వకపోయినా గత జనవరిలోనే పలు గ్రామాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో చోటా మోటా టీఆర్ఎస్ లీడర్లు ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచారు. వ్యాపారుల ముసుగులో క్వారీలు దక్కించుకున్న ఆ లీడర్లు నదిలో నీటిని మళ్లిస్తూ వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. వానలు పడే లోగా వీలైనంత ఎక్కువ ఇసుకను డంప్ చేసుకోవాలన్న స్కెచ్ తో సాంగ్వి గ్రామం వద్ద నదిలో నీటిని మళ్లించి దందా చేస్తున్నారు. ఈ అక్రమ దందా వరుస కథనాలతో అధికారులు స్పందించారు. ఇసుక తవ్వుతున్న ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. పలు యంత్రాలను సీజ్ చేశారు. అధికారుల తనిఖీలు గమనించిన తవ్వకం దారులు పరారయ్యారు. 

 

ఇవి కూడా చదవండి

ఆధునిక భారత్లో ప్రజాదరణ పొందిన నేత మోడీ

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి

రాజ్యాధికారంతోనే దళితుల బతుకుల్లో వెలుగులు