ఆధునిక భారత్లో ప్రజాదరణ పొందిన నేత మోడీ

ఆధునిక భారత్లో ప్రజాదరణ పొందిన నేత మోడీ
  • డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

న్యూఢిల్లీ: ఆధునిక భారత్లో అత్యంత ప్రజాధారణ పొందిన నాయకుల్లో మోడీ ఒకరని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ‘మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ సమక్షంలో విడుదల చేశారు. ఒక దిగ్గజ నాయకుడి 20 సంవత్సరాల ప్రయాణాన్ని రచయిత అద్భుతంగా ఆవిష్కరించాడని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. కలలను సాకారం చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నాయకుడని కొనియాడారు.

'మోదీ@20: డ్రీమ్స్​ మీట్​ డెలివరీ' పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ సమక్షంలో దిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీపై సరైన విశ్లేషణను పుస్తకంలో సమర్థంగా అందించారని రచయితలపై ప్రశంసలు కురింపించారు. ఒక దిగ్గజ నాయకుడి 20 సంవత్సరాల ప్రయాణాన్ని రచయితలు అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు వెంకయ్య నాయుడు. మోడీ దేశ ప్రజల కోసం ఎలా పెద్ద కలలు కంటున్నారు.. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఆ కలలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతున్నారనే విషయాలను ఈ పుస్తకంలో చక్కగా వివరించారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 
సీఎం అయ్యే వరకు కనీసం గ్రామ పంచాయతీని పాలించిన అనుభవం లేదు: అమిత్ షా
ప్రధాని మోదీ 20 ఏళ్ల పరిపాలనపై ప్రశంసలు కురింపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళుతోందని చెప్పారు.  ఈ పుస్తకంలో మోదీ చిన్న కార్యకర్త నుంచి అత్యంత ఆదరణ పొందిన నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని తెలియజేస్తుందన్నారు. 
ఆటోల్లో, బస్సుల్లో ప్రతి గ్రామానికి తిరిగి.. పేద వారితో కలిసి భోజనం చేసిన అనుభవశాలి మోడీ అన్నారు. మోడీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి కనీసం గ్రామాన్ని పాలించిన అనుభవం కూడా లేదు. కానీ, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో గెలిచి గుజరాత్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించారని అమిత్ షా వివరించారు. 

 

 

ఇవి కూడా చదవండి

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం