మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

రాష్ట్రంలో ఇంటర్ బోర్డు తప్పిదం మరోసారి బయటపడింది. ఒక్క రోజు ఒక్కో తప్పు బయటపడుతోంది. మొన్న సంస్కృతం బదులు కెమిస్ట్రీ పేపర్ ఇవ్వడంతో సూర్యాపేటలో గంటన్నర ఆలస్యంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ హిందీ మీడియంలో పొలిటికల్ సైన్స్ పేపర్ ను ప్రింట్ చేయలేదు. ఇంగ్లీష్ నుండి హిందీకి ట్రాన్స్ లేట్ చేసి స్టూడెంట్స్ కు ఇచ్చారు. 

హైదరాబాద్, నిజామాబాద్ లోని హిందీ మహావిద్యాలయలోని 50మందికి పైగా విద్యార్థులకు హిందీ క్వశ్చన్ పేపర్ ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఇంటర్ బోర్డు హిందీ పేపరే పబ్లిష్ చేయలేదు. ఆఖరికి చివరి నిమిషంలో గుర్తించిన ఇన్విజిలేటర్స్ ఇంగ్లీషులో ఉన్న పొలిటికల్ సైన్స్ పేపర్ ను చేతితో హిందీలో రాసి, విద్యార్థులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రశ్నలు సరిగ్గా అర్థం కాక అన్నింటికీ పూర్తిస్థాయిలో సమాధానాలు రాయలేకపోయాని విద్యార్థులు బాధపడినట్లు సమాచారం. 

మరిన్ని వార్తల కోసం.. 

నేపాల్ బౌలర్ ‘పుష్ప’ సెలబ్రేషన్స్.. ఐసీసీ రియాక్షన్

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు