V6 News

జేపీఎల్‌‎లో సెమీ ఫైనల్‎కు దూసుకెళ్లిన V6 వెలుగు

జేపీఎల్‌‎లో సెమీ ఫైనల్‎కు దూసుకెళ్లిన V6 వెలుగు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్‌‌ఈసీసీ–జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్‌‌) రెండో సీజన్‌‌లో వీ6 వెలుగు, టీవీ9 థండర్‌‌‌‌బోల్ట్స్‌‌ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి.  స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌‌జాట్) నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భాగంగా దుండిగల్‌‌లోని ఎంఎల్‌‌ఆర్‌‌‌‌ఐటీ గ్రౌండ్‌‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ప్రత్యర్థి జట్టు డిస్‌‌క్వాలిఫై అవ్వడంతో  వీ6 వెలుగు టీమ్‌‌కు సెమీస్ బెర్తు లభించింది.  మరో మ్యాచ్‌‌లో  ఏబీఎన్‌‌ టీమ్‌‌పై 58 పరుగుల తేడాతో విజయం సాధించిన థండర్‌‌‌‌బోల్ట్స్‌‌ జట్టు కూడా సెమీఫైనల్ చేరుకుంది.

 41 బంతుల్లోనే 89 పరుగులతో విజృంభించిన ఈ జట్టు కెప్టెన్ సాయి కిశోర్‌‌‌‌కు ‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా ఎంపికయ్యాడు. జేపీఎల్ మీడియా పార్ట్‌‌నర్‌‌‌‌ ఖ్యాతి కనెక్ట్స్‌‌ సీఈఓ ప్రేమ్ చంద్ అతనికి అవార్డు అందజేశారు. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఎంఎల్‌‌ఆర్‌‌‌‌ఐటీ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ వైస్ చైర్మన్‌‌ ధీరెన్ రెడ్డి మాట్లాడుతూ పది మీడియా సంస్థల జట్లతో అత్యంత ప్రొఫెషనల్ స్థాయిలో లీగ్ నిర్వహిస్తున్న ఎస్‌‌జాట్‌‌ ను అభినందించారు.