V6 News

వెలుగు క్రికెట్ టోర్నీ విజేత మహబూబ్ నగర్

వెలుగు క్రికెట్ టోర్నీ విజేత మహబూబ్ నగర్

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన  వెలుగు T20 క్రికెట్ టోర్నమెంట్ లో మహబూబ్ నగర్ జట్టు విజేతగా నిలిచింది. ఈ రోజు LB స్టేడియం లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో..  నిజామాబాద్ అర్బన్ జట్టు మహబూబ్ నగర్ టీం తో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహబూబ్ నగర్ నిర్ణిత 20 ఒవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లడ్డు గణేశ్ 50 పరుగులతో రాణించాడు.

133పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నిజామాబాద్ జట్టు ఆది లోనే వికెట్ ను కోల్పోయింది. మహబూబ్ నగర్ బౌలర్ ఆబెద్ వేసిన తొలి ఒవర్లోనే నిజమాబాద్ ఒపెనింగ్ బ్యాట్స్ మెన్ సూరజ్ నాయక్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో మరో ఒపెనర్ అనికేత్ రెడ్డి తో కలిసి కెప్టెన్ విక్రమ్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే మహబూబ్ నగర్ బౌలర్ల దాటికి నిజమాబాద్ అర్బన్ జట్టు 107 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మహబూబ్ నగర్ బౌలర్ ఆబెద్ మూడు వికెట్లు తీసి రాణించాడు. 36 పరుగుల తేడాతో మహబూబ్ నగర్ విజయ ఢంకా మోగించింది.

విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేసీఆర్, అతిథిగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.