విద్యార్థుల వద్దకే వ్యాక్సిన్​

విద్యార్థుల వద్దకే వ్యాక్సిన్​
  • స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి.. టీనేజర్స్​కు వ్యాక్సిన్​
  • స్టూడెంట్స్​ ఇంట్రెస్ట్​ చూపకపోవడంతో  మెడికల్​ సిబ్బంది చొరవ 

పద్మారావునగర్​, వెలుగు: కొవిడ్​ వ్యాక్సిన్ ​వేసుకునేందుకు  టీనేజర్స్​ నుంచి స్పందన లేకపోతుండగా  మెడికల్ ​  సిబ్బంది  స్కూళ్లు, కాలేజీలకు  వెళ్లి వేస్తున్నారు.  కేంద్రప్రభుత్వం ఈనెల 3 వ తేదీ నుంచి  15-–18 ఏండ్ల మధ్య వయసు వారికి వ్యాక్సిన్​ వేయాలని ఆదేశించింది. అయితే టీనేజర్స్ ​వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో సిటీలోని పలు అర్బన్​హెల్త్ సెంటర్ల మెడికల్​సిబ్బంది తమ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్​కు వ్యాక్సిన్ ​ఇస్తున్నారు.  స్పందన లేకపోతుండగా ఆన్​లైన్​ స్లాట్ లేకున్నా  వివరాలు నమోదు చేసుకొని వ్యాక్సిన్​ వేస్తున్నట్లు ఐడీహెచ్​కాలనీలోని గాంధీ అర్బన్​ ప్రైమరీ హెల్త్ సెంటర్​ మెడికల్​ఆఫీసర్​ డాక్టర్​కిరణ్​ తెలిపారు. రోజురోజుకూ కొవిడ్ ​కేసులు పెరుగుతుండగా యువత నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటనే టీకాలు వేసుకోవాలని కోరారు.  గాంధీ అర్బన్​ హెల్త్ సబ్​సెంటర్​ మెడికల్​ సిబ్బంది పద్మారావునగర్​ లోని శ్రీసాయి విజ్ఞాన్​భారతి జూనియర్​ కాలేజీకి వెళ్లి 150 మంది స్టూడెంట్స్​కు వ్యాక్సిన్​ వేశారు.  బోయిగూడలోని సెయింట్ ఫిలోమినా స్కూల్​లో 110 మంది స్టూడెంట్స్​కు కూడా వేసినట్టు  మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ ఆశాజ్యోతి గురువారం చెప్పారు.