ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపడం అవసరమా?

ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపడం అవసరమా?

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ టీకా ఉత్సవ్ నిర్వహణకు పిలుపునివ్వడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. సరిపడా వ్యాక్సిన్ నిల్వలు లేని సమయంలో టీకా ఉత్సవ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. 'కరోనా కేసులు పెరుగుతున్నందున వాక్సిన్ నిల్వలు తక్కువగా ఉండటం చాలా సీరియస్ విషయం. ఇది ఉత్సవం చేసుకోవాల్సిన సమయం కాదు. మనకు వ్యాక్సిన్ సరిపోని ఈ సమయంలో మిగతా దేశాలకు టీకా పంపడమేంటి? మన దేశ పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి ఇతర దేశాలకు టీకా పంపడం సరైనదేనా? కేంద్రం ఎలాంటి భేషజాలు చూపకుండా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలి. కరోనాను ఓడించడానికి మనం కలసికట్టుగా పని చేయాలి' అని రాహుల్ పేర్కొన్నారు.