ట్విటర్ లో మోడీని మించి దూసుకెళుతున్న నేసమణి

ట్విటర్ లో మోడీని మించి దూసుకెళుతున్న నేసమణి

పాకిస్థాన్ కు చెందిన కొందరు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్ధులు సుత్తి ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసి.. ఈ పరికరాన్ని మీ దేశంలో ఏమంటారు? అని ప్రశ్నించారు.  దీనికి తమిళ హాస్య నటుడు వడివేలు అభిమానులు “ఇది సుత్తి. నేసమణి (2001 లో వచ్చిన స్నేహమంటే ఇదేరా తమిళ రిమేక్ లో వడివేలు పాత్ర ) తలపై ఇది పడి గాయపడ్డాడు అని”, అందుకు సంబంధించిన ఓ కార్టూన్ ఫోటోను  వారి పోస్ట్ కు రిప్లైగా పోస్ట్ చేశారు. దీనికి  ‘#prayfornesamani’ అనే యాష్ ట్యాగ్ ను జత చేశారు.

ఇందులో విశేషమేంటంటే ఈ రోజు అంటే మే 30న దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం, ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే రోజు. ఎంతో ముఖ్యమైన ఈ రోజున నెటిజన్లంతా ఆ విషయాలను కాకుండా ట్విట్టర్‌లో #prayfornesamani, కు స్పందిస్తున్నారు. ట్రెండింగ్స్‌లో కూడా ఈ పోస్ట్ టాప్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరీ నేసమణి అంటూ గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. తమ అభిమాన కమెడియన్ ట్విట్టర్ ట్రెండింగ్ లో దూసుకుపోవడం చూసి వడివేలు అభిమానులు సంబరపడుతున్నారు.

పాక్ విద్యార్ధులు మాత్రం ఎవరో నిజంగా గాయపడ్డారని , నేసమణి త్వరగా కోలుకోవాలని పార్ధిస్తున్నట్లు ట్వీట్ చేస్తున్నారు.