SRH vs  RR ఎలిమినేటర్ మ్యాచ్.. హైదరాబాద్ భయమంతా ఆ ఒక్కడితోనే..!

SRH vs  RR ఎలిమినేటర్ మ్యాచ్.. హైదరాబాద్ భయమంతా ఆ ఒక్కడితోనే..!

ఐపీఎల్ 19లో భాగంగా బుధవారం (మే 27) మరో రసవత్తర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో ఓడిన జట్టు ఇంటి బాట పట్టాల్సిందే. దీంతో ఇరు జట్లు ఎలాగైనా గెలవాల్సిందేనని బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ఆర్ స్టార్ బ్యాటర్, వండర్ కిడ్ వైభవ్ సూర్య వంశీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ సీజన్‎లో పునకాలు వచ్చినట్లు చెలరేగిపోతున్న వైభవ్‎ను ఎలాగైనా అడ్డుకోవాలని హైదరాబాద్ వ్యూహాలు పన్నుతుంది. 

ఈ 15 ఏళ్ల బుడ్డోడిని భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. వైభవ్‎ను అడ్డుకుంటే ఆర్ఆర్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయవచ్చనేది హైదరాబాద్ ప్లాన్. సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్ఆర్‎తో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ గేమ్ ప్లాన్స్ గురించి కమిన్స్ క్లారిటీ ఇచ్చారు. 

వైభవ్ సూర్యవంశీ కోసం మూడు స్పెషల్ ప్లాన్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక బౌలర్‎గా బ్యాటర్ మైండ్ సెట్‎ను అర్థం చేసుకుని.. వాళ్ల స్ట్రెంత్‎ను అర్థం చేసుకుని ఎలా అడ్డుకోవాలో అదే చేస్తామని చెప్పాడు కమిన్స్. ప్రతీ టీమ్‎కు ఒకరు లేదా ఇద్దరు మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ ఉంటారని.. వాళ్లను అడ్డుకోవడమే స్ట్రాటజీ అన్నారు. వైభవ్ కోసం మూడు ప్లాన్ ఉన్నాయని చెప్పిన కమిన్స్.. ప్లాన్ A కాకుంటే.. ప్లాన్ B లేదా ప్లాన్ C ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు. 

లీగ్ దశలో రాజస్థాన్‎ను ఇప్పటికే రెండు సార్లు ఓడించిన హైదరాబాద్.. ఎలిమినేటర్ మ్యాచ్‎లోనూ ఇదే రిజల్ట్ పునరావృతం చేయాలని భావిస్తోంది. లీగ్ చివరి మ్యాచులో టేబుల్ టాపర్ ఆర్సీబీని భారీ తేడాతో చిత్తు చేసిన జోష్‎తో హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆర్ఆర్ కూడా బలంగానే ఉంది. లీగ్‎లో తమ చివరి మ్యాచులో పటిష్టమైన ముంబైని చిత్తు చేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది ఆర్ఆర్. దీంతో ఈ హై ఓల్టేజ్ పోరుపై భారీ హైప్ నెలకొంది. టోర్నీ నుంచి ఎవరో ఎలిమినేట్ అవుతారు..? ఎవరు ముందడుగు వేస్తారనేది.. వేచి చూడాలీ మరీ..