Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. తన ఫియర్ లేస్ బ్యాటింగ్‌తో రన్స్ రాబడుతూ ఆధునిక క్రికెట్ దిగ్గజాలనే ఆకట్టుకున్న ఈ టీనేజర్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో తన సత్తా చాటడానికి రెడీ అయ్యాడు. శ్రీలంకలో జరగబోయే టాలెంట్ టీవీ కప్ వన్డే ట్రై-సిరీస్ (Talent TV Cup) కోసం వైభవ్ లంకలో అడుగు పెట్టాడు. ఇండియా A, శ్రీలంక A, ఆఫ్ఘనిస్తాన్ A జట్ల మధ్య జరగబోయే ఈ కీలక టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడబోతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందరి కళ్లు వైభవ్ పైనే:
డొమెస్టిక్ క్రికెట్‌లో, ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో చిన్న వయసులోనే సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. ఇండియా A జట్టులో కీలక పాత్ర పోషించబోతున్న ఈ కుర్రాడికి.. విదేశీ పిచ్‌లపై ఆడటం ఇదే మొదటిసారి.. దాంతో లంక స్పిన్ పిచ్‌లపై మనోడు ఎలా ఎదురుదాడి చేస్తాడు అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ టోర్నమెంట్‌లో మూడు దేశాలకు చెందిన ఫ్యూచర్ స్టార్స్ తలపడబోతున్నారు. సీనియర్ టీమ్‌లోకి వెళ్లాలనుకునే యంగ్ ప్లేయర్స్ అందరికీ ఈ వన్డే సిరీస్ ఒక అద్భుతమైన ప్లాట్‌ఫారమ్ అని చెప్పొచ్చు.
సీనియర్ జట్టులోకి వెళ్లేందుకు గోల్డెన్ ఛాన్స్:
ఇండియా A మేనేజ్‌మెంట్ ప్రకారం.. భవిష్యత్తులో మెయిన్ టీం ఇండియాకు ఆడే దమ్మున్న ఆటగాళ్లను గుర్తించి, వాళ్లను రాటుదేల్చడానికి ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. క్రీజులోకి వస్తే చాలు బౌలర్ ఎవరనేది చూడకుండా బౌండరీల వర్షం కురిపించే వైభవ్ స్టైల్.. టీమిండియాకు ఫ్యూచర్‌లో పెద్ద అసెట్ కానుంది. శ్రీలంక A, ఆఫ్ఘనిస్తాన్ A జట్లలో కూడా ఎంతోమంది టాలెంటెడ్ కుర్రాళ్లు ఉన్నప్పటికీ.. లంక గడ్డపై మాత్రం ఎక్కువ ఫోకస్ అంతా మన వైభవ్ పైనే ఉండబోతోంది.
Teen sensation Vaibhav Suryavanshi has arrived in Dambulla for the Tri-Nation A Team Series featuring Sri Lanka A, India A, and Afghanistan A. #Cricket pic.twitter.com/VidKTpjdLL
— Nibraz Ramzan (@nibraz88cricket) June 5, 2026
