12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్.. సచిన్, యువరాజ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన బీహార్‌ కుర్రాడు

12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్.. సచిన్, యువరాజ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన బీహార్‌ కుర్రాడు

15 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ ఆడితే ఔరా అనుకుంటాం. కానీ బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ 12 ఏళ్ళ వయసులోనే ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి ఆశ్చర్యపరిచాడు. 2011 లో పుట్టిన వైభవ్..తాజాగా పాట్నాలోని మొయిన్-ఉల్-హక్ స్టేడియంలో ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో వైభవ్ తన తొలి మ్యాచ్ ఆడాడు. దీంతో భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ రికార్డ్ ను బ్రేక్ చేసి అతి పిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన నాలుగో భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.  
 
ఇప్పటివరకు ఈ రికార్డ్ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 15 సంవత్సరాల 57 రోజులలో యువీ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 15 సంవత్సరాల 230 రోజులకు తన తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డెబ్యూ చేసాడు. అయితే వైభవ్ సూర్యవంశీ మాత్రం 12 ఏళ్లకే అరంగేట్రం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    

 

ఈ యువ బ్యాటర్ గత సంవత్సరం క్వాడ్రాంగ్యులర్ అండర్-19 సిరీస్‌లో ఇండియా B U19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధ సెంచరీలతో 177 పరుగులతో ఆకట్టుకున్నాడు. వైభవ్ వినూ మన్కడ్ ట్రోఫీలో 78.60 సగటుతో 393 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వీటిలోఒక సెంచరీతో పాటు మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా నిన్న ముంబైపై జరిగిన రంజీ మ్యాచ్ లో వైభవ్.. మొదటి ఇనింగ్స్ లో 19 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేసి నిరాశపరించాడు.