Vaibhav Suryavanshi: వండర్ కిడ్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే.. అతి చిన్న వయసులో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, దాదాపు 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఆ రికార్డుకి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడా రికార్డును బ్రేక్ చేయడానికి వైభవ్ సిద్ధమయ్యాడు. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వైభవ్ బయటపెట్టాడు.
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. వైభవ్ భుజంపై చేయి వేసిన కింగ్ కోహ్లీ మాట్లాడుతున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇంతకీ కోహ్లీ, వైభవ్‌తో ఏం మాట్లాడాడు అనే ఆసక్తి అందరిలో కొనసాగుతుంది. ఈ విషయంపై కూడా వైభవ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ నా భుజంపై చేయి వేసి మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోయాయని అన్నాడు. తనను మరింత ముందుకు తీసుకెళ్లాలని కింగ్ తనతో చెప్పినట్లు వెల్లడించాడు.
►ALSO READ | అమెరికాలో ఇరాక్ స్ట్రైకర్ అరెస్ట్.. ఆందోళనలో ఫుట్‌బాల్ జట్టు.. 7గంటల పాటు విచారణ
కాగా వైభవ్ ఐపీఎల్ 2026లో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్‌తో పాటు మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ అవార్డ్‌లను సైతం వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అవార్డులు అందుకోవడం కోసం ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లిన వైభవ్‌తో కోహ్లీ పర్సనల్‌గా మాట్లాడాడు. ఐపీఎల్ ప్రదర్శనతో పాటు దేశవాలి క్రికెట్‌లోనూ రాణించడంతో వైభవ్‌ను సెలెక్టర్లు భారత టీ20 జట్టులోకి సెలక్ట్ చేశారు.
VAIBHAV SURYAVANSHI ON MEETING WITH VIRAT KOHLI & DREAM COME TRUE FOR ME. ❤️👑
— Tanuj (@ImTanujSingh) June 6, 2026
- He said "When Virat bhaiya placed his hand on my shoulder, it felt like a dream come true". pic.twitter.com/NIGVcEXQcr
