SRH vs RR: న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య కాసేపట్లో జరగబోయే హై-వోల్టేజ్ 'ఎలిమినేటర్' మ్యాచ్‌కి ముందే మైదానంలో సెగలు పుడుతున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లలో కనిపిస్తున్న విపరీతమైన పోటీతత్వం, గెలవాలనే కసి ఈ నాకౌట్ సమరాన్ని సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
నెట్స్‌లో వైభవ్ భీభత్సం:
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ నెట్ ప్రాక్టీస్‌లో పగబట్టినట్లు బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్‌లో మొదటి ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. ఏకంగా 45 నిమిషాల పాటు నెట్స్‌లో గడిపాడు. అందులో 40 నిమిషాల పాటు వైట్ బాల్స్‌ను దయాదాక్షిణ్యాలు లేకుండా దంచికొట్టాడు. అతడు కొట్టిన ధాటికి బంతులు స్టేడియంలోని మీడియా బాక్స్ గ్లాస్‌లను, కుర్చీలను తాకుతూ భీకరమైన శబ్దాలు చేశాయి. కేవలం 5 నిమిషాలు మాత్రమే రవి బిష్ణోయ్ వేసిన అద్భుతమైన యార్కర్లను డిఫెండ్ చేయడానికి కేటాయించి, మిగతా సమయమంతా బౌలర్లపై దండయాత్ర చేశాడు.
వైభవ్ ప్రశాంతతపై రాజస్థాన్ ఆల్‌రౌండర్ దాసున్ శనక మాట్లాడుతూ.. వైభవ్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు.. డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లు సైతం ఒత్తిడికి లోనవుతుంటారు, కానీ ఈ కుర్రాడు మాత్రం చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంటాడు. రన్స్ చేసినా, రన్స్ చేయకుండా అవుట్ అయినా ఒకేలా ఉంటాడు. అతడిలో అద్భుతమైన పొటెన్షియల్ ఉందని ప్రశంసించాడు.
ఫెరీరా సిక్సర్ల వర్షం:
వైభవ్ సూర్యవంశీ కంటే ముందే నెట్స్‌లోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ డొనొవాన్ ఫెరీరా వరుసగా 7 సిక్సర్లు బాది తన పవర్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత ఫెరీరా స్వయంగా వైభవ్‌కు బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో వైభవ్ కొట్టిన ఒక షాట్‌ను మిస్‌క్యూ చేయడంతో ఫెరీరా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ తీసుకోగానే ఫెరీరా మైదానంలో విమానంలా రెక్కలు చాపి 'షోయబ్ అక్తర్' తరహాలో సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాతి బంతికే వైభవ్ మళ్లీ కసితో ఫెరీరా బౌలింగ్ లో బౌండరీలు బాదేశాడు. లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలనే కసి రాజస్థాన్ ఉందనే విషయం క్లియర్ గా కనిపిస్తుదంఇ.
ట్రోలర్స్‌కు బ్యాట్‌తో సమాధానం చెప్పేందుకు ట్రావిస్ హెడ్ రెడీ:
రాజస్థాన్ రాయల్స్ దగ్గర కసి ఉంటే.. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దగ్గర అంతకంటే ఎక్కువ మంట ఉంది. వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో సెంచరీలు బాదిన బిగ్ మ్యాచ్ ప్లేయర్ హెడ్‌కు ఈ సీజన్ కాస్త హెచ్చుతగ్గులతో కొనసాగింది. దానికి తోడు సోషల్ ఇండియాలో కొంతమంది నెటిజన్లు అతడిపై, అతడి కుటుంబంపై దారుణమైన ట్రోల్స్, అబ్యూస్‌కు పాల్పడ్డారు. కానీ హిస్టరీ ప్రకారం చూస్తే.. ఇలాంటి అవమానాలే హెడ్‌కు మరింత బూస్ట్ గా మారి, పెద్ద మ్యాచ్‌లలో రెచ్చిపోయేలా చేస్తాయి.
SRH అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లకు ఇది తమ మార్క్ చూపించడానికి ఒక గొప్ప అవకాశం.. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి నేనేమీ మాట్లాడలేను కానీ, హెడ్ ఈరోజు నార్మల్‌గా ప్రాక్టీస్ చేశాడు. అతడు ఎప్పటిలాగే తన విధ్వంసకర ఆట తీరుతో మ్యాచ్-విన్నింగ్ రోల్ పోషిస్తాడనే నమ్మకం మాకుంది అని ధీమా వ్యక్తం చేశాడు.
ముల్లాన్‌పూర్‌లో ఒత్తిడి లేదు.. కేవలం మ్యాచ్ మాత్రమే:
ముల్లాన్‌పూర్ స్టేడియం చండీగఢ్ మెయిన్ సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉండటం, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి అవుట్ కావడంతో ఇక్కడ పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ఐపీఎల్ నిర్వాహకులు కొత్త బ్యానర్లు కట్టి 'వన్ ఫైనల్ లీప్' అని రాసినా.. ఆటగాళ్లకు మాత్రం ఇది మరో సాధారణ మ్యాచ్ మాత్రమే.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీ మైండ్‌తో బరిలోకి దిగుతున్న ఇరు జట్ల మధ్య జరగబోయే ఈ సమరం క్రికెట్ ఫ్యాన్స్‌కు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
