గాంధీనగర్: రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక (77 6) రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. 16 మ్యాచ్‌లలో 237.31 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్ హిస్టరీలోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ తర్వాత గుజరాత్ ఓపెనర్స్ సాయి సుదర్శన్ (710), శుభమన్ గిల్ (722) మాత్రమే ఏడు వందల ప్లస్ రన్స్ చేశారు. వీరిద్దరికి మాత్రమే వైభవ్‌ను బీట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచులో వీరిద్దరూ విఫలం కావడంతో ఐపీఎల్ 19 సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
►ALSO READ | RCB vs GT మధ్య ఫైనల్ ఫైట్.. లైవ్ అప్డేట్స్ మీకోసం..
ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన వైభవ్ సూర్యవంశీకి రూ.10 లక్షల ఫ్రైజ్ మనీ దక్కనుంది. ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలకే సాధ్యం కానీ ఈ రికార్డును 15 ఏళ్ల వయసులోనే సాధించిన వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ 19లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్స్
- వైభవ్ సూర్యవంశీ-776 (రాజస్థాన్ రాయల్స్)
- శుభమన్ గిల్-722 (గుజరాత్ టైటాన్స్)
- సాయి సుదర్శన్-710 (గుజరాత్ టైటాన్స్)
- హెన్రిచ్ క్లాసెన్-624 (సన్ రైజర్స్ హైదరాబాద్)
- ఇషాన్ కిషన్-602 (సన్ రైజర్స్ హైదరాబాద్)
